Author Archive: Soma Sankar
నాన్నా తొందరగా వచ్చేయ్
నా అనువాద కథలు రెండో సంకలనం “నాన్నా తొందరగా వచ్చేయ్”. ఇందులో పదిహేను కథలు. ఇవన్నీ దేనికి దానికి విభిన్నమైనవి. ఈ సంకలనంలోని కొన్ని కథలు హృదయాన్ని తాకుతాయి. కొన్ని కథలు ఆలోచింపజేస్తాయి, మరికొన్ని పాఠకుల పెదాలపై చిరునవ్వులని కదలాడిస్తాయి. ఈ సంకలనంలోని కథలని క్లుప్తంగా పరిచయం చేసుకుందాం. అమృత వర్షిణి: ఇతర దేశాలలో నిషేధించిన పురుగుమందులను మన దేశంలో యధేచ్ఛగా వాడడం వల్ల ఏం జరుగుతుందో ఈ కథ […]
ముసలోడూ సముద్రమూ
ఎర్నెస్ట్ హెమింగ్వే రాసిన “Old Man and the Sea” అనే నవలికకి తెలుగు అనువాదం ఇది. పులిట్జర్ ప్రైజు, నోబెల్ ప్రైజు గెలుచుకున్న పుస్తకం ఇది. క్యూబాకి చెందిన శాంటియాగో అనే ముసలి జాలరి కథ ఇది. అనూహ్యంగా, అతనికి ఎనభై నాలుగు రోజులపాటు ఒక్క చేప కూడా దొరకదు. అతను అత్యంత దురదృష్టవంతుడని ముద్రవేస్తారు తోటి జాలర్లు. అయినప్పటికీ, అంతటి విపత్కర పరిస్థితులలోనూ ధైర్యం కోల్పోడు శాంటియాగో. […]
కొంటె బొమ్మ సాహసాలు
కార్లో కొల్లోడి రాసిన “ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో ” అనే చిన్న పిల్లల నవలకి అనువాదం నా ఈ కొంటె బొమ్మ సాహసాలు. ఈ పుస్తకం మొదటగా 1882లో ఇటలీలో ముద్రితమైంది. తర్వాతి కాలంలో పలుమార్లు పునర్ముద్రితమైంది, వివిధ భాషలలోకి అనువాదమైంది. ఓ సాహితీప్రక్రియ, కాలగమనంలో దాదాపు 129 ఏళ్ళు నిలవగలిగిందంటే, దాని కథాంశం సజీవమనేది సుస్పష్టం! ఇక కథలోకి వస్తే, ఓ దారుశిల్పి కొయ్యతో ఒక కీలుబొమ్మని […]