రావత్ టీ స్టాల్
పర్యటనలు చేయడం, కొత్త ప్రదేశాలు చూడడం అందరికీ ఇష్టమే. కాని చూసే విధానమే మనం టూరిస్టులమా లేక ట్రావెలర్లమా అనేది తెలియజేస్తుంది. యాత్రాకథనాల పుస్తకాలు డిటిపి చేసేడప్పుడు, శ్రీయుతులు దాసరి అమరేంద్ర, పరవస్తు లోకేశ్వర్, ప్రొ. ఎం. ఆదినారాయణ గార్లతో పరిచయమయ్యాక ఆ వ్యత్యాసం నాకు స్పష్టంగా తెలిసింది.
ఆ తేడాని ఒక కథ రూపంలో చదవడం మాత్రం కొంచెం కొత్తే. ఈ ఏడాది మార్చి నెలలో ఒక ఆన్లైన్ హిందీ మ్యాగజైన్లో “రావత్ టీ స్టాల్” అనే కథని చదివాను. ఆ కథ – పర్యాటకులకీ, యాత్రికులకి మధ్య ఉండే తేడాని చాలా స్పష్టంగా చెప్పింది.
ఆ కథని తెలుగులోకి అనువదిస్తే బాగుంటుందనిపించింది. మూల రచయిత్రిని సంప్రదించి అనువాదానికి అనుమతి పొందాను.
అందమైన ప్రకృతీ, ఆహ్లాదకరమైన పరిసరాలు! కల్మషం లేని మనుషులు! చదువుకోడానికి పుస్తకాలు! రుచికరమైన టీ!! పర్యటనలలో ఇంకేం కావాలి? యాత్రికులకూ, భావుకులకూ మదిలే నిలిచిపోయి, అందమైన జ్ఞాపకంగా మిగిలే అనుభవం ఈ కథ సారం.
“రావత్ టీ స్టాల్” కథని అదే పేరుతో అనువదించాను. తెలుగు అనువాదం నేటి (28 మే 2017) ఆంధ్రప్రభ దినపత్రిక, ఆదివారం అనుబంధంలో ప్రచురిత్రమైంది. ఈ లింక్ లో కథని చదవవచ్చు.
RawatTeaStallAPSunday28May2017
No comments
Be the first one to leave a comment.