Home » My Translations » నేను అనువదించిన కొన్ని విదేశీ కథలు

 

నేను అనువదించిన కొన్ని విదేశీ కథలు

 

నేను అనువదించిన కొన్ని విదేశీ కథలు ఈమాట వైబ్ సైట్‌లో ఉన్నాయి. ఆసక్తి ఉన్న పాఠకులు ఈ లింకులలో ఆ కథలను చదవచ్చు.

* * *

1. ఏడుగంటల వార్తలు: యుద్ధ బీభత్సంపై ఓ మహిళ ఆలోచనాంతరంగం ఈ కథ.

మేం పడుకునే గదిలోకి రాగానే మా మంచం అంచు మీదే కూర్చున్నాం, కళ్ళు విప్పార్చుకొని. ‘‌వాళ్ళెవరై ఉంటారో? నాజీలా?’ ఈ మధ్యే విడుదలైన యుద్ధపు సినిమాల్లోని సన్నివేశాలు నా కళ్ళ ముందు మెదిలాయి. జైళ్ళ దృశ్యాలు, వేధింపుల దృశ్యాలు, చెప్పలేని అమానుష చర్యల దృశ్యాలు… మా అమ్మ మాట వింటే బాగుండేది. నేనిక్కడకి రాకుండా ఉండాల్సింది. నా ఆత్మవిశ్వాసం తృటిలో సడలిపోయింది. కే భయంతో తన చేతిరుమాలుని ముళ్ళేస్తూ, విప్పుతూ ‘ఆ బొమ్మ టాంకే కదా?’ అంది. ‘ఆరు చక్రాలా, ఎనిమిదా? పక్కనుంచి పొడుచుకొస్తూ తుపాకులే గదా? అది టాంకే’.

మేము తలుపు గడియ పెట్టుకున్నాం. కుర్చీని గడియ కిందికి నెట్టాం. నేను రాత్రంతా మేలుకునే ఉన్నాను, ఎవరైనా గదిలోకి చొరపడతారేమోనని చెవులు రిక్కించి, బాంబులు, బుల్లెట్ల రొద కోసం, సైనికుల సెయ్‌గ్ హెయ్‌ల్ శాల్యూట్ల అరుపుల కోసం. తెల్లారాక మాకు గది చూపించినావిడని అడిగాం, రాత్రి జరిగిన ఆ సమావేశం దేని గురించని. అప్పుడు తెలిసింది వారంతా అగ్నిమాపక దళం సిబ్బందని. నల్లబల్ల మీది ఆ బొమ్మ ఫైరింజను. పక్కన ఉన్నవి తుపాకులు కావు, నీళ్ళ గొట్టాలు. మా మూర్ఖత్వానికి మేము నవ్వుకున్నాం. యుద్ధం జీవితం పట్ల మన దృక్పధానికి రంగులు పులుముతుంది.

పూర్తి కథ చదవడానికి ఈ లింక్‌ని అనుసరించండి.

 * * *

2. సెన్సిటివిటీ ట్రెయినింగ్: నిజమైన సెన్సిటివిటీ అంటే ఏమిటో చెప్పే కథ.

ఉన్నట్లుండి, “ఫ్రాంక్, నిజం చెప్పు. నేను ‘సెన్సిటివ్’నా కాదా” అని శాల్ అడిగింది.

“నువ్వు సెన్సిటివ్వే. కాదని ఎవడన్నాడు? నా రోజెలా గడిచిందని అడుగుతావు, అది సెన్సిటివ్వేగా. పైగా నువ్వు కిటికీలోంచి బయటకి చెత్త పారేయడం నేనెప్పుడూ చూడలేదు”

“అబ్బా, సెన్సిటివ్ అంటే అది కాదు. మనం ఇతర మతస్తుల తోటీ, వేరే జాతీయుల తోటీ మర్యాదగా ప్రవర్తిస్తున్నామా లేదా అని”

నేను ఒక నిమిషం పాటు ఆలోచించాను. మేమిద్దరం షికాగోకి దక్షిణంగా, అందరూ ఐరిష్-కాథలిక్కులే ఉన్న ప్రాంతంలో పెరిగాం. అప్పట్లో అక్కడ వేరే జాతీయులు, పరాయి మతస్తులు ఎవరూ లేరు. ఇప్పుడు ఇక్కడ రేమాండ్ అనే నల్లవాడు నాకు నేస్తం. పోతే గ్రేడీస్‌లో పనిచేసేడప్పుడు యువాంచిటో! వాళ్ళతో నేను సెన్సిటివ్‌గా ఉన్నానో లేనో నాకు తెలియదు. రేమాండ్ చెప్పే కుళ్ళు జోకులంటే నాకు ఇష్టం. ఇక యువాంచిటో అయితే నేను విపరీతంగా తాగేసినప్పుడల్లా నన్ను ఇంటికి మోసుకొచ్చేవాడు.

“పోన్లే, నీకంత అనుమానంగా ఉంటే ఆ మీటింగ్ కి వెళ్ళు. ఏమవుతుందట? ఇంకొంచెం సెన్సిటివ్ గా తయారవుతావు. అంతే కదా” అన్నాను.

పూర్తి కథ చదవడానికి ఈ లింక్‌ని అనుసరించండి.

 * * *

3. గాంధీ అభిమాని: గాంధీగారిని అభిమానించే ఓ విదేశీయుడు, ప్రమాదంలో గాయపడి రక్తం కావల్సి వచ్చిన ఓ వ్యక్తికి సాయం చేయాలనుకుంటాడు. అయితే అతని మనసులో ఎన్నో సందేహాలొస్తాయి, పశ్నలు తలెత్తుతాయి. మనిషిలోని ద్వంద్వ ప్రవృత్తిని చిత్రిస్తుందీ కథ.

“నేను సాయం చేయాలి.” పైకే అనుకున్నాడతను. నేను యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు రక్తదానం చేసాను. అప్పటి నుంచి ప్రతీ ఏడాది కెనడియన్ హార్ట్ అసోసియేషన్‌కి ఇరవై డాలర్లు, కెనడియన్ మెంటల్ హెల్త్ సొసైటీకి ఇరవై డాలర్లు, ఆర్థరైటిస్ సొసైటీకి పది డాలర్లు విరాళంగా ఇస్తునే ఉన్నాను. ఇవి కాకుండా పదనాలుగు డాలర్ల నలభై మూడు సెంట్లు ప్రతీ వారం ప్రొవిన్షియల్ హెల్త్ ప్లాన్ కోసం కడుతున్నాను. మరి అలాంటప్పుడు – అత్యవసర పరిస్థితుల కోసం ఒక్క పైంట్ ఓ-పాజిటివ్ రక్తాన్ని కూడా నిలువ ఉంచుకోలేని బుద్ధిహీనుల అసమర్థత నా తప్పా? పైగా ఈ మంచుతుఫానులో రోడ్లమీద తిరిగి ఇలా ప్రమాదాలు తెచ్చుకునే వాళ్ళకోసం, ఇంట్లో కూర్చుని ఓ గొప్ప సినిమాని చూడకుండా నేనెందుకెళ్ళాలి?”

ఈ ఆలోచనల జడిలో అతను కొంత చాక్లెట్ డ్రింక్‌ని చేతిమీద ఒంపుకున్నాడు. వాటిని తుడుచుకుంటూ, “హాస్పిటల్‌లో ఓ-పాజిటివ్ గ్రూప్ రక్తం కోసం ఎదురుచూస్తున్న వారు కూడా నాలానే మహాత్ముడైన గాంధీ గురించిన సినిమా చూద్దామనే, ఆయన జీవితంనుంచి స్ఫూర్తి తెచ్చుకుందామనే అనుకున్నారేమో, కాకపోతే హఠాత్తుగా వాళ్ళింటికి నిప్పంటుకుని ఉండచ్చు; లేదా హాస్పిటల్‌లో పరీక్ష చేసినప్పుడు నిలవ ఉన్న ఓ-పాజిటివ్ గ్రూప్ రక్తం చెడిపోయిందని తెలిసిందేమో.” అని అనుకున్నాడు.

పూర్తి కథ చదవడానికి ఈ లింక్‌ని అనుసరించండి.

ఈ కథలు చదివాక మీ అభిప్రాయాలు తెలియజేయండి.

 

 

 

 

Tags: , ,

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment