Home » Book Intro » దేవుడికి సాయం

 

దేవుడికి సాయం

 

DevudikiSayam600
నా సొంత కథల సంకలనం “దేవుడికి సాయం” ఈబుక్‌గా విడుదలైంది. ఫిబ్రవరిలోనే ప్రక్రియ మొదలుపెట్టినా, పూర్తయ్యేసరికి ఆలస్యం అయ్యింది. శ్రీనివాసాచారి గారు గీసిన చక్కని కవర్ పేజీతో, ప్రముఖ విశ్లేషకులు శ్రీ విహారి గారి ముందుమాటతో, 16 కథలున్న ఈ పుస్తకం కినిగెలో లభిస్తుంది.
127 పేజీలున్న ఈ పుస్తకం వెల రూ.100/- మాత్రమే.
“సోమ శంకర్ కథానికలు అన్నిటా క్లుప్తత ప్రాణశక్తిగా జ్వలిస్తోంది. ఈ గుణ విశేషం ఈ కథల్ని మరీ మరీ తేజోమయం చేస్తున్నాయి. శైలి రసస్ఫురణంకి అనువైన రీతిలో కథలన్నిటా గోచరిస్తున్నది. చక్కటి చదివించే గుణం ఈ శైలి వలన సమకూరింది. మనుషుల ఆనంద విషాదాల్ని ఆవిష్కరించటంలో, జీవన వాస్తవికతని వ్యాఖ్యానించటంలో — కథా శిల్పిగా తన ప్రత్యేకతనీ, ముద్రనీ నిరూపించుకున్నారు — సోమ శంకర్. నిరాడంబరంగా కనిపిస్తూ, చక చకా చదివిస్తూ, గాఢమైన అనుభూతిని అందిస్తున్న మంచి కథానికల సంపుటికి స్వాగతం.” అన్నారు విహారి గారు తన ముందుమాటలో.
మరి మీరేమంటారు? చదివి మీ అభిప్రాయాలు తెలియజేయగలరు.

Tags: , , , , , ,

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment