Home » Book Intro » నా కథలు చదవండి

 

నా కథలు చదవండి

 

DevudikiSayam600
ఇవి మన కథలు. మన నిత్యజీవితంలో రోజూ మనకు తారసపడే సంఘటనలతో అల్లిన కథలు. ఈ కథల్లోని పాత్రలు మనకు సుపరిచితమే.
ఈ పాత్రలు మనలానే ఆలోచిస్తాయి, మనలాగే ప్రవర్తిస్తాయి. సమాజంలోని మంచి, చెడుని ప్రతిబింబిస్తాయి. దయ, మంచితనం, తోటివారికి చేయగలిగిన సాయం చేయడం, తమకు చేతనైనంతలో సంఘానికి మేలు చేయాలనుకోడం వంటి లక్షణాలతో పాటు; స్వార్థం, దురాశ, కుత్సితం, ఎదుటివాళ్ళని తొక్కేసైనా తాము పైకెళ్ళిపోవాలనే స్వభావం, తమ ఉన్నతికి కోసం దేనికైనా తెగించడం వంటి లక్షణాలనూ ఆయా పాత్రలు కనబరుస్తాయి.
ఈ కథలలో – కెరీర్‌లో ఎదగాలనుకుని ఆ దిశలో కృషి చేసే యువతీయువకులతో పాటు, ఆశలపల్లకిలో ఊరేగుతూ, కలలో లోకంలో విహరిస్తూ… ప్రయత్నం చేయక పరిస్థితులను నిందించేవారూ కనపడతారు.
కేవలం భౌతిక రూపానికే ప్రాధాన్యం ఇచ్చి, మనుషులను ఎందుకు దూరం చేసుకోకూడదో కొందరు చెబితే, వర్తమాన సమాజంలో ఒత్తిడి ఎలా ప్రభావితం చేస్తోందో మరికొందరు చెబుతారు.
ప్రపంచీకరణ, ప్రైవేటీకరణ.. వంటివి మధ్య, దిగువతరగతి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో కొన్ని కథలు చెబుతాయి. కంటికింపుగా కనిపిస్తున్న ప్రయోజనాలనే కాకుండా మనోనేత్రంతో గ్రహించాల్సిన కష్టనష్టాలనూ ప్రస్తావిస్తాయి.
నేటి సమాజంలోని మంచిని హర్షిస్తునే, దూసుకొస్తున్న పెనుమార్పుల దుష్పరిమాణాలకు పరిష్కారం కనుగొనేదిశగా ప్రేరేపిస్తాయి ఈ కథలు.
సూటిగా… సుత్తి లేకుండా… మనసుల్ని తాకే కథలివి. చదవండి – “దేవుడికి సాయం“. 16 కథలున్న ఈ పుస్తకం కినిగెలో లభిస్తుంది.

Tags: , , , , , ,

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment