వందా… పూర్తయ్యాయి…
అమ్మయ్య.. మొత్తానికి సెంచరీ కొట్టేసాను.
వందవ అనువాద కథ ప్రచురితమైంది.
99వ కథ అనువాదం పూర్తి చేసిన తర్వాత కనీసం ఓ ఇరవై కథలు చదివాను.. చివరికి మూడు కథలను ఎంపిక చేసుకుని అనుమతుల కోసం రాస్తే, ఒక్క కథకి దొరికింది.
అదే “పలక కావాలి”. చిన్న కథే అయినా బావుంది.
పిల్లల గురించి తమకంతా తెలుసని పెద్దలు భావిస్తారు, నిజానికి పిల్లల మనసులో ఏముందో పెద్దలు సరిగ్గా గ్రహించలేరని ఈ కథ చెబుతుంది. నా తెలుగు అనువాదాన్ని వాకిలి వెబ్ మాసపత్రిక ప్రచురించింది. వాకిలిలో ఇదే నా మొదటి రచన.
ఈ లింక్ లో కథ చదవండి.
అలాగే, వాకిలి అక్టోబర్ 20014 సంచికలో నా ఇంటర్వ్యూ కూడా ప్రచురించారు. లింక్ ఇదిగో. ఇదీ చదవండి.
వాకిలి బృందానికి ధన్యవాదాలు.
1 Comment
Read English Version of this story of Shatakshi. Very emotional and heart touching story.