Home » My Stories » సముద్రమంత సంకల్పం

 

సముద్రమంత సంకల్పం

 

నేను అనువదించిన “సముద్రమంత సంకల్పం” అనే కథ 8 నవంబర్ 2015 నాటి నవ తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం “సోపతి”లో ప్రచురితమైంది. ఈ లింక్ లో కథ చదవగలరు.
పశ్చిమ గుజరాత్‌ తీరంలోని ఓ ప్రాంతంలో చేపట్టిన పోర్ట్‌ నిర్మాణం వల్ల తీవ్రంగా ప్రభావితమైన ఓ మత్స్యకార గ్రామంలోని ప్రజల దుస్థితిని, సముద్రంతో ప్రజల కుండే అనుబంధాన్ని ఈ కథ చక్కగా వివరిస్తుంది, గ్రామీణుల అమాయకత్వాన్ని ఆసరగా చేసుకుని వాళ్ళని ఏమార్చానుకునే రాజకీయనాయకులకు గ్రామస్థులు ఎలా బుద్ధి చెప్పారన్నదీ ఆసక్తికరంగా ఉంటుంది. గుండె దిటవున్న ఓ సామాన్యుడు వజ్ర సంక్పంతో ప్రజలని సంఘటితం చేసి ఉద్యమం నడిపి, నాయకుడిగా ఎదిగిన వైనాన్ని ఈ కథ చెబుతుంది.
మూలకథని గుజరాతీలో శ్రీ మావ్‌జీ మహేశ్వరీ “దరియా” అనే పేరుతో రాయగా, శ్రీ మనోజ్‌ ఛాయా “The Ebbing Sea” అనే పేరుతో ఆంగ్లంలోకి అనువదించారు. ఆంగ్ల అనువాదం సుప్రసిద్ధ వెబ్‌జైన్ www.museindia.com లో సెప్టెంబర్ 2015 సంచికలో ప్రచురితమైంది

 

1 Comment

Post a Comment