Home »

 

రచయిత గురించి

 

కొల్లూరి సోమ శంకర్ వయసు 47 సంవత్సరాలు. చదువు బి.ఎ. మానవ వనరుల నిర్వహణలో PG Diploma చేసారు. దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి భాషా ప్రవీణ పాసయ్యారు. ప్రస్తుత నివాసం హైదరాబాదు.

కొల్లూరి సోమ శంకర్ 2001 నుంచి కథలు రాస్తున్నారు. 2002 నుంచి హిందీ, ఇంగ్లీష్ నుంచి తెలుగులోకి కథలను అనువదిస్తున్నారు. ఇప్పటి దాక 40 సొంత కథలు రాసారు, 106 కథలను అనువదించారు. మంచి కథలు ఎక్కడ చదివినా, వాటిని తెలుగులోకి అనువదించడానికి ప్రయత్నిస్తుంటారు.

ఈ మధ్య కాలంలో వచ్చిన కొన్ని మంచి తెలుగు కథలని హిందీలోకి అనువదిస్తున్నారు. ప్రస్తుతానికి 4 కథలని అనువదించారు.

సోమ శంకర్ ఉద్యోగ రీత్యా పలు స్వచ్చంద సంస్థలలో వివిధ హోదాలలో పనిచేసారు. ఆఫీసు అడ్మినిస్ట్రేషన్‌లోను, ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్‌లోను దాదాపుగా 14 ఏళ్ళ అనుభవం సాధించారు. ఆయన తన ఉద్యోగ బాధ్యతలలో భాగంగా ఎన్నో ట్రైనింగ్ మాన్యుల్స్‌ని ఆంగ్లం, హిందీ నుంచి తెలుగులోకి అనువదించారు. అలాగే, తెలుగు నుంచి, ఆంగ్లంలోకి, హిందీలోకి తర్జుమా చేసారు.

ఫిక్షన్, నాన్-ఫిక్షన్ మాత్రమే కాకుండా, సోమ శంకర్ వివిధ స్వచ్చంద సంస్థల హెల్త్ ఎడ్యుకేషన్, హెల్త్ ఇన్సురెన్స్, మైక్రో ఫైనాన్స్ లోని వివిధ అంశాలలో ట్రైనింగ్ మెటీరియళ్ళను తెలుగులోకి అనువదించారు.

 

No comments

Be the first one to leave a comment.

Post a Comment