పుస్తకాలు
ప్రయాణానికే జీవితం![]() అద్భుతమైన సాహస యాత్రాకథనం అజిత్ హరిసింఘానీ రాసిన “వన్ లైఫ్ టు రైడ్” అనే పుస్తకానికి కొల్లూరి సోమ శంకర్ అనువాదం. ఓ అద్భుతమైన నిజజీవిత సాహస యాత్ర గురించి హాస్య చతురతతోను, నిశితాలోచనతోను, నిజాయితీతోను రాసిన ఈ పుస్తకం చివరి దాకా ఆసక్తిగా చదివిస్తుంది. ప్రింట్ బుక్ గానూ, ఈబుక్ గానూ లభిస్తుంది. ఈ పుస్తకాన్ని కినిగె.కామ్ నుంచి కొనుక్కోవచ్చు. ఈ పుస్తకంపై వచ్చిన ఓ సమీక్షని చదవండి. |
దేవుడికి సాయం![]() కొల్లూరి సోమ శంకర్ కథలు ఈ ‘దేవుడికి సాయం’ సోమ శంకర్ స్వకపోలకల్పితమైన తెలుగు కథా సంపుటి. ఈ కథలన్నీ వివిధ తెలుగు పత్రికల్లో ప్రచురింపబడినవే. నిరాడంబరంగా కనిపిస్తూ, చక చకా చదివిస్తూ, గాఢమైన అనుభూతిని అందిస్తున్న మంచి కథానికల సంపుటి. ఈబుక్ గా లభిస్తుంది. ఈ పుస్తకాన్ని కినిగె.కామ్ నుంచి కొనుక్కోవచ్చు. |
వెదురు వంతెన![]() అనువాద కథా సంకలనం సోమశంకర్ అనువాద కథల మూడవ సంకలనం “వెదురు వంతెన”. ఈ పుస్తకంలో వివిధ భాషల నుంచి అనువదించిన 14 కథలున్నాయి. ఈబుక్‌గా లభిస్తుంది. ఈ పుస్తకాన్ని కినిగె.కామ్ నుంచి కొనుక్కోవచ్చు. ఈ పుస్తకంపై వచ్చిన ఓ సమీక్షని చదవండి. |
నాన్నా తొందరగా వచ్చేయ్![]() అనువాద కథా సంకలనం “నాన్నా తొందరగా వచ్చేయ్” అనేది సోమశంకర్ రెండవ అనువాద కథా సంకలనం. ఈ పుస్తకంలో వివిధ భాషల నుంచి అనువదించిన 15 కథలున్నాయి. ఈబుక్‌గా లభిస్తుంది. ఈ పుస్తకాన్ని కినిగె.కామ్ నుంచి కొనుక్కోవచ్చు. |
మనీ ప్లాంట్![]() అనువాద కథా సంకలనం మనీ ప్లాంట్ అనేది 2006లో వెలువడిన అనువాద కథా సంకలనం. మూల కధలను హిందీ, ఇంగ్లీష్, తమిళం, కాశ్మీరి, బంగ్లా భాషల నుంచి తీసుకున్నారు. ఈ పుస్తకంలో 19 కథలున్నాయి. ప్రింట్ బుక్ గానూ, ఈబుక్ గానూ లభిస్తుంది. ఈ పుస్తకాన్నికినిగె.కామ్ నుంచి కొనుక్కోవచ్చు. ఈ పుస్తకంపై వచ్చిన ఓ సమీక్షని చదవండి. |
కొంటె బొమ్మ సాహసాలు![]() పిల్లల కోసం వినోదాత్మక, విజ్ఞానదాయకమైన నవలిక కార్లో కొల్లోడి రాసిన “ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో ” అనే చిన్న పిల్లల నవలకి అనువాదం ఈ కొంటె బొమ్మ సాహసాలు. పీపుల్స్ ట్రస్ట్ వారి అనుబంధ ప్రచురణ సంస్థ “పీచిక్స్” ఈ పుస్తకాన్ని ప్రచురించింది. ప్రింట్ బుక్‌గా లభిస్తుంది. ఈ పుస్తకాన్ని పీకాక్ క్లాసిక్స్ వారి నుంచి కొనుక్కోవచ్చు. పుస్తకం గురించి ఇక్కడ చదవచ్చు. |
4 x 5![]() నలుగురు రచయితల కథల సంపుటి కొల్లూరి సోమ శంకర్ 2004లో మిత్రులు వడ్డి ఓం ప్రకాష్ నారాయణ, వేదాంతం శ్రీపతి శర్మ మరియు కస్తూరి మురళీకృష్ణతో కలిసి “4 x 5″ అనే కథా సంకలనం వెలువరించారు. ఈ పుస్తకంలో నలుగురు రచయితలు ఒక్కొక్కరు ఐదేసి కథలు అందించారు. కాబట్టి పుస్తకానికి 4×5 అనే పేరు పెట్టారు. ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలలోనూ లభిస్తుంది. లేదా ప్రతుల కోసం ప్రచురణకర్తని సంప్రదించవచ్చు. |
ఆనందం మీ సొంతం![]() సద్గురువుతో ముఖాముఖి ఎమెస్కో బుక్స్ ప్రచురించిన “ఆనందం మీ సొంతం” అనే పుస్తకాన్ని సోమ శంకర్ అనువదించారు. ఈ పుస్తకం సాధకులని జాగృతం చేసే ఉద్దేశంతో ప్రశ్న – జవాబుల రూపంలో రూపొందించబడినది. ఈ పుస్తకంలోని ప్రతీ జవాబు సాధకులు తమని తాము కనుగొనేందుకు, తమని తాము తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది. ఈ పుస్తకం దేశవ్యాప్తంగా ఒకే సారి ఒకే రోజు తొమ్మిది నగరాలలో తొమ్మిది భాషలలో 9 సెప్టెంబర్ 2009 నాడు విడుదలైంది. ప్రింట్ బుక్‌గా లభిస్తుంది. ఈ పుస్తకాన్ని ఎమెస్కో బుక్స్ వారి నుంచి కొనుక్కోవచ్చు. |
రాబోయే రచనలు
- Friedrich Frobel రాసిన The Education of Man అనే పుస్తకానికి తెలుగు అనువాదం.
- అమర్త్య సేన్ రాసిన The Idea of Justice అనే పుస్తకానికి తెలుగు అనువాదం.
- ఎన్.సి. పండా (శక్తిపాద) రాసిన “యోగ నిద్ర” అనే పుస్తకానికి తెలుగు అనువాదం.
- “Instant Tools for Blissful Living” అనే పుస్తకానికి తెలుగు అనువాదం.
No comments
Be the first one to leave a comment.