కార్లో కొల్లోడి రాసిన “ది అడ్వెంచర్స్ ఆఫ్ పినోకియో ” అనే చిన్న పిల్లల నవలకి అనువాదం ఈ కొంటె బొమ్మ సాహసాలు. ఈ పుస్తకం ఇటీవలే విడుదలైంది. పీపుల్స్ ట్రస్ట్ వారి అనుబంధ ప్రచురణ సంస్థ “పీచిక్స్” ఈ పుస్తకాన్ని ప్రచురించింది. రూ.60/- ఖరీదున్న ఈ 128 పేజిల పుస్తకానికి పంపిణీదారులు విశాలాంధ్ర పబ్లిషింగ్ హౌస్.
మనీ ప్లాంట్ అనేది 2006లో వెలువడిన అనువాద కథా సంకలనం. మూల కధలను హిందీ, ఇంగ్లీష్,తమిళం, కాశ్మీరి, బంగ్లా భాషల నుంచి తీసుకున్నారు. పుస్తకానికి ముందు మాటను శ్రీమతి కె బి లక్ష్మి గారు, శ్రీ గుడిపాటి గారు రాసారు. శ్రీమతి అబ్బూరి ఛాయాదేవి గారు పుస్తకాన్ని ఆవిష్కరించారు. కినిగె.కాం నుంచి మనీప్లాంట్ eBookని కొనుగోలు చేయవచ్చు.
కొల్లూరి సోమ శంకర్ 2004లో మిత్రులు వడ్డి ఓం ప్రకాష్ నారాయణ, వేదాంతం శ్రీపతి శర్మ మరియు కస్తూరి మురళీకృష్ణ తో కలిసి “4 x 5″ అనే కథా సంకలనం వెలువరించారు. ఈ పుస్తకం లో నలుగురు రచయితలు ఒక్కొక్కరు ఐదేసి కథలు అందించారు. కాబట్టి పుస్తకానికి 4x5 అనే పేరు పెట్టారు.
ఎమెస్కో బుక్స్ ప్రచురించిన "ఆనందం మీ సొంతం" అనే పుస్తకాన్ని సోమ శంకర్ అనువదించారు. ఈ పుస్తకం సాధకులని జాగృతం చేసే ఉద్దేశంతో ప్రశ్న – జవాబుల రూపంలో రూపొందించబడినది. ఈ పుస్తకంలోని ప్రతీ జవాబు సాధకులు తమని తాము కనుగొనేందుకు, తమని తాము తెలుసుకునేందుకు ఉపకరిస్తుంది. 152 పేజీల ఈ పుస్తకం వెల 75/-రూపాయలు.
Copyright© 2012 Soma Sankar | All rights are reserved.